Saturday, April 27, 2024

TS – రాజ్య‌స‌భ‌కు రేణుకా, అనిల్ లు నామినేష‌న్స్ ….

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకాచౌదరి, అనిల్ కుమార్ యాదవ్‌లు రాజ్యసభకు నేడు నామినేషన్ దాఖలు చేశారు. టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేత దీపాదాస్ మున్షీ సమక్షంలో అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మూడు సెట్లుగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు తుమ్మల, పొంగులేటి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు.

బీఆర్ఎస్‌కు ఒక్క రాజ్యసభ సీటు దక్కే అవకాశం!

మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థిగా వద్దిరాజు రవి చంద్ర రాజ్యసభ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా, ఇవాళ్టితో నామినేషన్ల గడువు ముగిసింది. రేపు నామినేషన్లు పరిశీలన ఉంటుంది. 20వ తేదీన ఉపసంహరణ, 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాలు ఉంటాయి. అసెంబ్లీలో బ‌లాబ‌లాలు దృష్ట్యా కాంగ్రెస్ రెండు, బిఆర్ఎస్ ఒక స్థానం గెలుచుకోన‌న్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement