Sunday, April 28, 2024

TS: 30వేల రిజ‌ర్వాయ‌ర్ల‌లో 93కోట్ల చేప‌పిల్ల‌లు.. వృత్తిదారుల‌కు ఉపాధి కోస‌మేన‌న్న‌ మంత్రి స‌బిత‌

Rangareddy: రాష్ట్రంలో 30 వేల చెరువులు, రిజర్వాయర్లలో 93 కోట్ల చేప పిల్లలను వదిలే కార్యక్రమం జరుగుతుందని మంత్రి స‌బితా రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఒకే రోజు 7లక్షల చేప పిల్లలు వదిలే కార్యక్రమాన్ని ఆదివారం లాంఛనంగా ఆమె ప్రారంభించారు. బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ విడత చేపల పిల్లల పంపిణీ లో భాగంగా బాలాపూర్ పెద్ద చెరువులో 32,400 చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడారు..

ఏమ‌న్నారంటే…
89 కోట్ల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేప‌డుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల రూపాయల వ్యయంతో 10 కోట్ల రొయ్య పిల్లలను 200 నీటి వనరుల్లో విడుదల చేస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో 836 చెరువులు, కుంటల్లో ఒక కోటి 25 లక్షల రూపాయల వ్యయం చేసే ఒక కోటి 72లక్షల చేప పిల్లలను వదులుతున్నాం. కుల వృత్తుల బలోపేతం చేయటానికి, వారు ఆర్థికంగా ఎదగటానికి సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

చేపలు, గొర్రెల పంపిణీతో ఆయా కుల వృత్తుల వారికి అండగా ప్రభుత్వం నిలుస్తుంది. రజకులకు ఉచిత ధోబి ఘాట్ లు, లాండ్రీలకు విద్యుత్ తో లబ్ది చేకూర్పు. గతంలో చేపల కోసం ఆంధ్ర మీద ఆధార పడే వాళ్ళం, నేడు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తెలంగాణలో పెరిగిన మృత్స సంపద. మిషన్ కాకతీయతో చెరువులు జలకళ‌ సంతరించుకున్నాయి. వాటిలో చేప పిల్లలను వదులుతున్నాం. కాళేశ్వరంతో దాని కింద ఉన్న చెరువులు నిండి, భూగర్భ జలాలు పెరిగాయి. అన్నారు. కార్యక్రమంలో మేయర్ పారిజాత, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, పార్టీ అధ్యక్షుడు రాంరెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement