Tuesday, May 7, 2024

Tributes – జయశంకర్ జీవితం విద్యార్థులకు ఒక సిలబస్ – రవీందర్ గౌడ్..

బొంరాస్ పేట్, ఆగస్ట్ 06 ( ప్రభ న్యూస్ ) : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొ”జయశంకర్ అని టివివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ అన్నారు. జయశంకర్ జయంతి ని పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రం , మండల తాసిల్దార్ కార్యాలయం ఆవరణలోని విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళిని అర్పించారు.

ఈసందర్భంగా ఉపాధ్యాయ సంఘాల‌ నాయకులు మాట్లాడుతూ, జయశంకర్ జీవితం కళాశాల విద్యార్థులకు ఒక సిలబస్ వంటిదని గుర్తుచేశారు. ప్రతి కళాశాల, పాఠశాల, లైబ్రరీలలో ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఆయన వేసిన ప్రతి అడుగు విద్యార్థినీ, విద్యార్థులకు, మార్గనిర్దేశం అని సూచించారు. యువత జయశంకర్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన చూపిన బాటలో నడవాలన్నారు.
ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాకారం చంద్రశేఖర్, టీజేఏసీ తాలూకా నాయకులు గౌరారం గోపాల్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement