Thursday, May 2, 2024

TS: అప్పుడు ఆ రాగం.. ఇప్పుడు ఈ రాగం..! తుమ్మలను ఎద్దేవా చేసిన మంత్రి పువ్వాడ

ఖమ్మం బ్యూరో : మాజీ మంత్రి, కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పాలేరులో అప్పుడు ఆ రాగం, ఖమ్మంలో ఇప్పుడు ఈ రాగం పలుకుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఖమ్మం నగరంలోని బీఆర్ ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఖానాపురం హవేలీ పరిధిలోని డివిజన్ ల బూత్ లెవెల్ కమిటీ సమావేశంలో పువ్వాడ అజయ్ కుమార్ నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. పాలేరు ప్రజల కాళ్లు కడుగుతా అని తిరిగి తిరిగి.. ఇప్పుడు కొత్తగా ఖమ్మం ప్రజల కాళ్ళు కడుగుతా అని కొత్త రాగం ఎత్తుకోవడం విచిత్రంగా ఉందన్నారు. నా దగ్గర ఉన్నోళ్లు అంతా రౌడీలు, దొంగలు అంటూ విచక్షణా రహితంగా మాట్లాడుతున్నారన్నారు. తమ దగ్గర ఉన్న వాళ్ళు కేవలం ప్రగతిని కాంక్షించే వాళ్ళు.. ముమ్మాటికీ వాళ్లు అద్భుతంగా పేద ప్రజల అభ్యున్నతి కోసమే పని చేస్తున్నారని అన్నారు.

మీ దగ్గర ఉన్నోళ్లు ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. డీసీసీబీ సెంట్రల్ బ్యాంక్ ను నట్టేట ముంచి నిట్ట నిలువునా దోచుకున్న వాళ్ళు.. రౌడీ షీటర్లు, ప్రజల ఆస్తులు దోచుకున్నవారే తుమ్మల వెంట ఉన్నారన్నారు. మీరు పదవులు ఇచ్చినోళ్ళు సమర్థులు.. మేము పదవులు ఇస్తే అసమర్ధులా అని ప్రశ్నించారు.. మా దగ్గర ప్రజల కోసం పని చేసే వాళ్ళు.. బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని అన్నారు. రాబోయే రోజుల్లో పోలీస్ లను జీప్ ల ముందు ఉరికిస్తా అని అంటున్నారనీ నిప్పులు చెరిగారు.. పోలీస్ వ్యవస్థ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు… వారి విధులను కూడా నువ్వే నిర్ణయిస్తావా.. నేను ఏది చెయ్యమంటే అది చేస్తారా.. కొంచం అయినా బుద్ది ఉండాలి కదా అంటూ మండిపడ్డారు. వాళ్ల అధ్వర్యంలో పేదల గుడిసెలు నిర్దాక్షిణ్యంగా పీకేశారు.. కానీ నేను ఎవ్వరి గుడిసెలు పీకలేదు.. వాళ్లకు రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం నుండి డబ్బులు కూడా ఇప్పించినమన్నారు. మనం ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు.. మనం ప్రజలకు చేసిన అభివృద్ధిని వివరించే పనిలో ప్రతిఒక్కరూ నిమగ్నం కావాలని కోరారు.

రాజకీయాల్లోకి వచ్చింది కేవలం అభివృద్ది చేయడానికే తప్ప ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవడం మా అభిమతం కాదు. అభివృద్ది మాత్రమే మా ఎజెండా అని అన్నారు. ఢిల్లీ నుండి గల్లీ దాకా ఏ సర్వే తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని రిపోర్ట్ ఉంది అని, అందులో మనం ఉండాలి అంటే ప్రతి నాయకుడు, కార్యకర్తలు మీ మీ డివిజన్ లో కథన రంగంలోకి దిగాలన్నారు. ఈ
కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షడు పగడాల నాగరాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్ కొత్తపల్లి నీరజ, దండా జ్యోతి రెడ్డి, నాగండ్ల కోటి, కూరాకుల వలరాజ్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి రావు, భీరెడ్డి నాగచంద్రా రెడ్డి, వల్లభనేని రామారావు, మేకల సుగుణ రావు, చిరుమామిళ్ళ నాగేశ్వరరావు, సరిపుడి సతీష్, నాగుల్ మీరా, తొట్టి కోమరయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement