Friday, October 4, 2024

TS | తిరస్కరణ సబబే.. గవర్నర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీల తిరస్కరణ విషయంలో గవర్నర్‌ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదన్నారు. తెలంగాణ ప్రజల తరఫున గవర్నర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా ఉంటేనే.. గవర్నర్‌గా వ్యవహరించినట్టా?, కేసీఆర్‌ చేస్తున్న తప్పిదాలు, పొరపాట్లను ఎత్తి చూపుతూ ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే.. గవర్నర్‌గా మీక నచ్చరా? అని ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

గవర్నర్‌ కోటా, రాష్ట్రపతి కోటా పదవులు.. మేధావులు, విద్యావంతులు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నామినే-టె-డ్‌ పదవులని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ గతంలోనూ అనేక క్రిమినల్‌ కేసులు ఉన్న వ్యక్తులను ఎమ్మెల్సీలుగా నియమించాలని గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపితే గవర్నర్‌ తిరస్కరించారని గుర్తు చేశారు. కేసీఆర్‌ కుటు-ంబానికి సేవ చేసే వ్యక్తులను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. తమ కాళ్లదగ్గరపడి ఉండేవాళ్లకు, వాళ్ల మోచేతి నీళ్లు తాగే వాళ్లకు, ఆత్మగౌరవం లేని వాళ్లకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తోందని దుయ్యబట్టారు.

అలాంటి వారికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలనడం న్యాయం కాదన్నారు. పార్టీలు ఫిరాయించిన వారు, కేసీఆర్‌ కుటు-ంబానికి మాత్రమే సేవచేసే వారిని గవర్నర్‌ రిజెక్ట్‌ చేశారని వ్యాఖ్యానించారు. బీజేపీతో ఏ మాత్రం సంబంధం లేని తెలంగాణ నుంచి ఒక సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌ను ఎంపీగా ప్రధాని మోడీ ప్రతిపాదిస్తే రాష్ట్రపతి ఆమోదించారని చెప్పారు. దక్షిణాది నుంచి పీటీ- ఉష లాంటి అంతర్జాతీయ క్రీడాకారిణిని ప్రతిపాదించగా రాష్ట్రపతి ఓకే చేశారని గుర్తు చేశారు. గవర్నర్‌ స్వతంత్రంగా వ్యవహరిస్తారని, ఏ పార్టీతో ఆ పదవికి సంబంధం ఉండదని, తమ కాళ్ల దగ్గర ఉండేవాళ్లు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉండాలని కోరుకోవడం సమంజసం కాదని సీఎం కేసీఆర్‌కు హితవు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement