Monday, April 29, 2024

తెలంగాణ‌లో ఉబ‌కాయం స‌మ‌స్య త‌క్కువే.. జాతీయ కుటుంబ ఆరోగ్య స‌ర్వేలో వెల్ల‌డి

దేశంలోని దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే ఊబకాయం (అధిక బరువు) తక్కువగా ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తేలింది. తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య, సీఎస్‌డీ రీజనల్‌ డైరెక్టర్‌ (ఇన్‌చార్జి) ప్రొఫెసర్‌ సుజిత్‌ కుమార్‌ మిశ్రా విడుదల చేసిన గణాంకల ప్రకారం తమిళనాడులో అధికంగా స్థూలకాయ కేసుల శాతం 9.5 శాతంగా న‌మెద‌వ్వ‌గా.. కర్నాటకలో 6.9 శాతం, కేరళలో 5.7 శాతం న‌మోదైన‌ట్టు తెలుస్తోంది. అయితే.. తెలంగాణలో 2 శాతం మాత్ర‌మే ఉన్న‌ట్టు వారి నివేద‌క వెల్ల‌డిస్తోంది.

ఈ గణాంకలు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా వివ‌రాల‌ ఆధారంగా వెల్ల‌డించారు. దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో మహిళల అధిక బరువు, ఊబకాయం స్థితి సమగ్ర చిత్రాన్ని దీనిలో పొందుప‌రిచారు. దేశ స్థాయిలో ఆంధ్రప్ర‌దేశ్ లో 15-49 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషుల కంటే స్త్రీలలో ఊబకాయం ఎక్కువగా ఉందని ఈ డేటా వెల్లడిస్తోంది. కేరళ, తమిళనాడులో కూడా ఇదే విదంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే కర్నాటక, తెలంగాణలో ఈ సంఘటనలు మహిళల్లో కొంచం తక్కువగా ఉన్నాయని డేటా తెలియ‌జేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement