Tuesday, May 7, 2024

TS: ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టాలి… ఎమ్మెల్సీ కవిత

నిజమాబాద్ సిటీ, అక్టోబర్ 20 (ప్రభ న్యూస్) : ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. శుక్రవారం నిజాంబాద్ నగరంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణతో కాంగ్రెస్ కు ఎన్నికల బంధమే.. బి ఆర్ యస్ ది పేగు బంధం.. పేగుబంధాన్ని తెలంగాణ ప్రజలు కచ్చితంగా ఆధరిస్తారని కవిత ధీమా వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయాలనుకుంటున్న ప్రతిపక్షాల కుట్రలను బీఆర్ఎస్ తిప్పికొట్టాలని కవిత పిలుపునిచ్చారు.

తెలంగాణ వారు చేసింది చెప్పుకోరు.. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఖచ్చితంగా బీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రతి తలుపు తట్టాలన్నారు.. ప్రతి గుండె తట్టాలని, ప్రజలకు చెప్పాలని పేర్కొన్నారు. మన ప్రయత్నం.. సమానంగా అన్ని డివిజన్లను అభివృద్ధి చేశాం.. ఏ డివిజన్ లోనూ ఓట్లు తగ్గవద్దన్నారు. అతి విశ్వాసం వద్దు.. ఎన్నికలంటే ఇంటి పెళ్ళి లాగా.. అందరి దగ్గరికి వెళ్ళి ఓటేయమని చెప్పాలన్నారు. హనుమంతుడి గుడి లేని ఊరు లేదు.. కేసీఆర్ పథకం చేరని ఇళ్ళు లేదు.. అవిశ్రాంతంగా బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణతో కుటుంబ సంబంధం ఉందంటున్న రాహుల్ ఒక్కసారి ఆలోచించాలన్నారు. తెలంగాణను ఆంధ్రలో కలిపింది నెహ్రూ…369 మంది విద్యా ర్థులను పొట్టన పెట్టుకుంది ఇందిరాగాంధీ నాయకత్వంలోని ప్రభుత్వమేనన్నారు.

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడంలో రాహుల్ గాంధీ కుటుంబ పాత్ర ఉందన్నారు. తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకోవడంలో ఆ కుటుంబ పాత్ర ఉందన్నారు. రాహుల్ వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. ఇందిరా గాంధీ హాయంలో 1969 ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న వారిపై కాల్పులు జరిపిందన్నారు. తెలంగాణకు చెందిన ఉమ్మడి రాష్ట్ర సీఎం అంజయ్యను హైదరాబాద్ విమానాశ్రయంలో రాజీవ్ గాంధీ అవమానించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన వారిపై ఇందిరాగాంధీ కాల్పులు జరిపిస్తే 369 మంది అమరులయ్యారని, 2009లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించి వెనక్కి వెళ్లిన కారణంగా వందలాది మంది అమరులయ్యారనీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయ మిడతల దండు వస్తది.. వారిని పట్టించు కోకుండా బీఅరెస్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్య మంత్రి అయ్యేలా శ్రమిద్దామన్నారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మె ల్యే గణేష్ బి, నగర మేయర్ దండు నీతూకిరణ్, నగర అధ్య క్షుడు రాజు, బీఆర్ఎస్ నాయకులు అలీమ్, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement