Monday, April 29, 2024

Vardannapet : నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం.. ఎమ్మెల్యే అరూరి

సీఎం కేసీఅర్, న్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో వర్దన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేసున్నానని బీఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అద్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. హాసన్ పర్తి ఎర్రగట్టు గుట్ట వద్ద గల KLN కాన్వెన్షన్ హల్లో హాసన్ పర్తి మండల ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే అరూరి రమేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… హాసన్ పర్తి మండల పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో చర్చించారు. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షస్తూ వీలైనంత తొందరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో గ్రామాలు, డివిజన్లలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామన్నారు. ప్రభుత్వం అందించే నిధులతో గ్రామాలను అభివృద్ధికి ప్రతీకలుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రతినిత్యం కృషి చేస్తున్నానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement