Tuesday, April 30, 2024

Thank you Sir – తెలంగాణ‌కు 12 మెడిక‌ల్ క‌ళాశాల‌లు.. మోడీకి బండి కృత‌జ్ఞ‌త‌లు..

క‌రీంన‌గ‌ర్ – తెలంగాణ‌కు 12 మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌కు కేంద్రం అనుమ‌తి మంజూరు చేయ‌డం ప‌ట్ల తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ కి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుక్ ఎల్.మాండవీయకి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ట్విట్ చేశారు..

కాగా, మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా..సీఎం కేసీఆర్ పైనా విరుచుకుపడ్డారు బండి సంజ‌య్ . కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించటంలేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుంటారు.సహకరించపోతే ఇన్ని మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తుందా?దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడతారు? అంటూ ప్రశ్నించారు.తెలంగాణాకు 13 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వడం హర్షణీయం అని..కరీంనగర్ కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు సంతోషమని అన్నారు బండి. తెలంగాణ అభివృద్ధికి సంక్షేమం విషయంలో కేంద్రం ప్రత్యేక నిధులిస్తోందని కానీ..రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది అంటూ ఆరోపించారు. కేంద్రానికి సహకరించకపోయినా తెలంగాణ ప్రజలపట్ల మోడీకి ఉన్న అభిమానంతో తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement