Monday, April 15, 2024

Warangal : ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్టు

వరంగల్ : ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న మైనర్ తో సహా ముగ్గురు దొంగలను సిసిఎస్, సుబేదారి పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. వీరి నుండి రెండు లక్షల 75 వేల రూపాయల విలువైన మూడు ద్విచక్ర వాహనాలతో పాటు రెండు సెల్ ఫోన్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి క్రైమ్స్ ఏసిపి డేవిడ్ రాజు వివరాలను వెల్లడిస్తూ.. పోలీసులు అరెస్టు చేసిన మైనర్ బాలుడితో పాటు మరో ఇద్దరు నిందితులు విసునూటి రవీందర్ అలియాస్ బబ్లూ, అలుగు నరసింహరావు ఈ ముగ్గురు నిందితులు హనుమకొండ హంటర్ రోడ్డులోని దీనదయాల్ నగర్ చెందిన కావడంతో వీరి మధ్య స్నేహం కుదరటంతో ఈ ముగ్గురు నిందితులు మద్యం సేవిస్తూ జల్పాలు చేసేవారు. వీరిలో బాల నేరస్థుడు గతంలో హనుమకొండలోని పద్మాక్షీ దేవాలయంలో హుండీ పగులగొట్టి డబ్బు చోరీ చేసిన సంఘటనలో బాల నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేయగా, మిగితా ఇద్దరు నిందితులు కూడా గతంలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కారు. పోలీసులు అరెస్టు చేసిన ఈ ముగ్గురు నిందితులు గత నెల హనుమకొండ, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇంటి ముందు పార్కు చేసిన‌ రెండు ద్విచక్ర వాహనాలను నిందితులు చోరీ చేశారు.

ఈ ద్విచక్రవాహన చోరీలకు సంబంధించి కేసుల నమోదు కావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ ఆదేశాల మేరకు క్రైమ్స్ డిసిపి మురళీధర్ అధ్వర్యంలో క్రైం విభాగానికి చెందిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు అందుబాటులో టెక్నాలజీని వినియోగించుకుని నిందితులను గుర్తించడం జరిగింది. ఈరోజు ఉదయం నిందితులు చోరీ చేసిన వాహనంపై ముగ్గురు నిందితులు హంటర్ రోడ్ లోని రాజ్ హోటల్ పరిసరాల్లో సంచరిస్తున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం రావడంతో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించగా నిందితులు పాల్పడిన దిచక్ర వాహనాల చోరీలను అంగీకరించారు.. నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన క్రైమ్స్ డిసిపి మురళీధర్, క్రైమ్స్ ఏసిపి డేవిడ్ రాజు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్, సుబేదారి ఇన్ స్పెక్ట‌ర్ షూకూర్, సిసిఎస్, సుబేదారి ఎస్.ఐలు యాదగిరి, .రమేష్, ఏఎస్.ఐ గోపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ జంపయ్య, కానిస్టేబుళ్ళు చంద్రశేఖర్, సదానందం, వినోద్, నజీరుద్దీన్, శ్రీకాంత్లతో సుబేదారి పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement