Thursday, September 21, 2023

TS: సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన సంజయ్

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి నుండి కోరుట్లలో పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం హైదరాబాదులోని ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి పుష్పగుచ్చం అందించారు.

- Advertisement -
   

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చారని, తప్పకుండా విజయం సాధిస్తానన్నారు. ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వారికి వివరిస్తున్నామని సీఎంకు తెలియజేశారు. సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయి.. మంచి మెజార్టీతో విజయం సాధిస్తావు ఆల్ ద బెస్ట్ సంజయ్ అని కేసీఆర్ సంజయ్ ని ఆశీర్వదించారు. అనంతరం సంజయ్ తన ట్విట్టర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసిన ప్రతిసారి తెలియని ఎనర్జీ వస్తుందని పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement