Thursday, September 21, 2023

108 వాహనంలో మహిళ ప్రసవం – పండంటి పాపకు జన్మనిచ్చిన తల్లి

మోత్కూర్, సెప్టెంబర్ 14 (ప్రభ న్యూస్) యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలంలోని గోవిందాపురం గ్రామానికి చెందిన బుర్రు అమృత (24) మొదటి కాన్పు ప్రసవ వేదనతో మోత్కూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఉమ్మనీరు సమస్యతో స్థానిక వైద్యులు భువనగిరి ఏరియా ఆసుపత్రికి 108 లో తరలిస్తుండగా, మార్గమధ్యంలో రాయగిరి వద్ద 108 అంబులెన్స్ లోనే పాపకు జన్మనివ్వగా, తల్లి పిల్ల క్షేమంగా ఉన్నట్లు మెరుగైన చికిత్సకు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు 108 సిబ్బంది ఈ ఎం టి ఎస్ భాస్కర్, పైలట్ సోమేశ్వర్ లు తెలిపారు..

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement