Friday, May 3, 2024

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. డీహెచ్, డీజీపీ, కార్మిక, జైళ్ల శాఖలు, జీహెచ్ఎంసీ వేర్వేరుగా నివేదికలు సమర్పించారు. కరోనా పరిస్థితులపై హైకోర్టుకు సమగ్ర నివేదికను అందజేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచుతున్నామని, గత నెల 29న లక్ష పరీక్షలు నిర్వహించామని ఆరోగ్యశాఖ పేర్కొంది. రెండో దశ ఫీవర్ సర్వేలో 68.56 మందికి పరీక్షలు నిర్వహించామని హెల్డ్ డైరెక్టర్ తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులపై ఫిర్యాదుల పరిశీలనకు ముగ్గురు ఐఏఎస్ లతో టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 10 ప్రైవేటు ఆస్పత్రులకు కరోనా చికిత్స లైసెన్సులు రద్దు చేసినట్లు వెల్లడించారు. 79 ఆస్పత్రులకు 115 షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని తెలిపారు.

రాష్ట్రంలో 744 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదు అయ్యాయని… బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలకు దేశవ్యాప్తంగా కొరత ఉందని చెప్పారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు 1500 పడకలు అందుబాటులో ఉన్నాయి డీహెచ్ తెలిపారు. కరోనా చికిత్సలకు తగినన్ని ఆస్పత్రులు, పడకలు ఉన్నాయన్నారు. కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మందుల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేశామని…ప్రజలను అప్రమత్తం చేస్తామని ఆరోగ్య శాఖ కౌంటర్‌లో పేర్కొంది.

మరోవైపు హైకోర్టుకు డీజీపీ మహేందర్ రెడ్డి కూడా నివేదిక సమర్పించారు. ఔషధాల బ్లాక్ మార్కెట్ పై 150 కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు 7.49 లక్షల కేసులు నమోదు చేశామన్నారు. మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు, రూ.35.81 కోట్ల జరిమానా విధించామన్నారు. భౌతిక దూరం పాటించనందుకు 41,872 కేసులు, జనం గుమిగుడినందుకు 13,867 కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 2.61 లక్షల కేసులు పెట్టామన్నారు. లాక్ డౌన్ ను నిబంధనల మేరకు కఠినంగా అమలు చేస్తున్నామని డీజీపీ తెలిపారు.

ఇది కూడా చదవండి: బి.1.617 వేరియంట్‌కు ‘డెల్టా’గా నామకరణం

Advertisement

తాజా వార్తలు

Advertisement