Thursday, April 25, 2024

పవన్ పై రాజమౌళి తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా పవన్ కళ్యాణ్ కు సినిమా సినిమాకు కూడా ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ మరే హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ పై ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్కో హీరో కి ఒక్కో కథ ను మీరు ఎలా రాస్తారు అని ఓ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ ను అడగగా… కొన్ని విషయాలను చెప్పారు.

పవన్ కి అయితే కొత్త కథలు అవసరం లేదని అతనిని చూడటానికె థియేటర్స్ కి ప్రజలు వెళ్తారని ఆయన చేసిన సినిమాలన్నింటిలో చిన్న చిన్న ముక్కలు, పాటలు ఫైట్స్ పెడితే సరిపోతుందని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఒక డైనమైట్ అని లాంటివాడిని అతనికి ఒక నిప్పురవ్వ చాలని చెప్పుకొచ్చారు. ఇక పవన్ ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ తో పాటు హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement