Wednesday, May 1, 2024

తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. నేటి నుంచే కొత్త ధర అమలు

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట. ఒకటో తేదీ శుభవార్త అందింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. రేట్ల తగ్గింపు నిర్ణయం ఈరోజు నుంచే అంటే జూన్ 1 నుంచే అమలులోకి వచ్చింది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) తాజాగా 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐఓసీ వెబ్‌సైట్ ప్రకారం.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.122 దిగొచ్చింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1473కు తగ్గింది. ఇకపోతే మే నెలలో కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ.45 మేర తగ్గిన విషయం తెలిసిందే. ముంబైలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1422కు తగ్గింది. కోల్‌కతాలో కూడా సిలిండర్ ధర రూ.1544కు దిగొచ్చింది. చెన్నైలో కూడా ఇదే పరిస్థితి ఉంది. సిలిండర్ ధర రూ.1603కు తగ్గింది.

మరోవైపు 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఈ నెలలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో సిలిండర్ ధర రూ.809 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో రూ.835 వద్ద ఉంది. ముంబైలో సిలిండర్ ధర రూ.809 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర రూ.825 వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement