Wednesday, May 1, 2024

ఫిబ్ర‌వ‌రి 12వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాలు.. ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం

నిన్న‌టి నుండి తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. కాగా ఈ స‌మావేశాలు ఫిబ్ర‌వ‌రి 12వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయ‌ని అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది ప్ర‌భుత్వం. ఈ నెల 6వ తేదీన తెలంగాణ బడ్జెట్‌ ను హరీష్‌ రావు ప్రవేశ పెట్ట‌నున్నారు. ఇక 7వ తేదీ నుంచి.. 12 వ తేదీ వరకు తెలంగాణ బడ్జెట్‌ చర్చ ఉండనుంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్ర‌ధాని మోడీ హ‌యాంలోనే గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెరిగాయ‌న్నారు కేటీఆర్..ఇదీ మోడీ ఘ‌న‌త అన్నారు.45ఏళ్ల చ‌రిత్ర‌లో అత్య‌ధిక నిరుద్యోగం ఉంద‌న్నారు. 2022క‌ల్లా ఎన్నో చేస్తాన‌న్నార‌ని మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement