Friday, May 3, 2024

TS | ఆరోగ్య తెలంగాణకు అండగా తెలంగాణ ఫుడ్స్.. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

ఆరోగ్య తెలంగాణ కోసం తెలంగాణ ఫుడ్స్ సంస్థ కృషి చేస్తోందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ అన్నారు. ఇవ్వాల (బుధవారం) తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్యారోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకోని నాచారంలొని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో పనిచేసే 700 మంది కార్మికులకు హ్యండ్ ఆఫ్ హోప్ ఎన్జీవో సాయంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

హ్యండ్ ఆఫ్ హోప్ సంస్థ నిర్వాహకులు జవహర్ కెనెడీ ఆధ్వర్యంలో ఆరుగురు వైద్యుల బృందం కార్మికులకు వైద్యపరీక్షలు చేసి అవసరమైన మందులు ఉచితంగా అందజేసింది.. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన విజయ డైరీ డెవలప్మెంట్ చైర్మన్ సోమా భరత్, గీత కార్మిక చైర్మన్ పల్లె రవికుమార్, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్‌ దూది మెట్ల బాలరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement