Saturday, April 27, 2024

ప‌ట్టిసీమ నీటి వాటాకు తెలంగాణ ఉడుంప‌ట్టు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పాలమూరు- రంగా రెడ్డి ప్రాజెక్టు నీటి కేటాయుంపులకోసం జాతీయ స్థాయిలో తెలంగాణ పట్టు బిగిస్తుంది. ఏపీ చేస్తున్న అభ్యంతరాలను, అపెక్స్‌ కౌన్సిల్‌ కు చేసిన ఫిర్యాదు లను ఎండగడుతూ జస్టీస్‌ బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు ఆంధ్ర అభ్యంతరాలను తప్పుబడుతూ వాదనలు వినిపించేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ నివేదికలను రూపొందిస్తుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు నిర్దిమైన డీపీఆర్‌ లేదనీ, పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందనీ, నీటి కేటాయింపులు లేకున్నా ప్రాజెక్టు నిర్మిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అపెక్స్‌ కౌన్సిల్‌ కు చేసిన ఫిర్యాదులో వాస్తవంలేదని బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు వాదనలకు రాష్ట్ర నీటి పారుదల శాఖ సిద్ధమైంది. కృష్ణా నీటి కేటాయింపుల్లో తెంగాణకు జరిగిన అన్యాయాన్ని ట్రిబ్యునల్‌ ముందు ఫవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు నీటిపారు దల శాఖ ప్రణాళికలను రూపొందిస్తుంది.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సమగ్ర అభివృద్ధి నివేదికలను కెఆర్‌ఎంబీ, అపెక్స్‌ కౌన్సిల్‌, బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కు సమర్పించినప్పటికీ ఏపీ మొండి వాదనలకు దిగుతుందని నీటి పారుదల శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కృష్ణా జలాల్లో ని 299 టీఎంసీ ల్లో చిన్ననీటి పారుదల కోసం కేయించిన 45 టీఎంసీల మిగులు జలాలు సిద్ధంగా ఉన్నయి. అలాగే పోలవరం నుంచి పట్టిసీమ ద్వార కృష్ణా పరివాహక ప్రాంతంలో కలుస్తున్న నీటి నుంచి అవార్డు మేరకు రావల్సిన 45 టీఎం సీలు కేటాయిస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు నీటి కేటాయింపుల్లో ఎలాంటి సమస్యలు లేవని రాష్ట్రం ఇంజనీరింగ్‌ విభాగం నివేదికలను సిద్ధం చేసింది. ఏఫ్రిల్‌ 12, 13 వ తేదీన జస్టీస్‌ బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు ఈ అంశాలను ఉదహరిస్తూ తెలంగాణ నుంచి ప్రముఖ న్యాయవాది సి.ఎస్‌. వైద్యనాదన్‌, సీనియర్‌ న్యాయవాదులు రామకృష్ణా రెడ్డి, వి.రవీందర్‌ రావు, ఏఓఆర్‌ నిఖి స్వామి, రాష్ట్ర కృష్ణా పరివాహక ప్రాంతం ఎస్‌ ఈ విజయకుమార్‌ తదితర జలనిపుణులు వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 246 ను రద్దు చేయాలని ఏపీ చేసిన ఫిర్యాదును తెలంగాణ ఇప్పటికే తప్పు పట్టింది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుని కృష్ణా జలాలను పోతిరెడ్డి పాడుద్వారా ఆంధ్రకు తరలించేం దుకు ఏపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని తెలంగాణ భావిస్తుంది. జూరాల ప్రాజెక్టు నుంచి కృష్ణానదీ జలాలనుఎత్తిపోసి మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి,నల్గొండ, హైదరాబాద్‌ తాగునీరు అందిం చడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టులో అంతర్భా గంగా 8.51టీఎంసీ లు నార్లపూర్‌, 6.55 ఏదుల, 16.74 వట్టెం, 17.34 కరివెన, 16.03 ఉద్దండపూర్‌, 2.8 లక్ష్మీ దేవి పల్లి రిజర్వాయర్లకు నీరు అందించడం ప్రాజెక్టు ఉద్దేశం. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, పూర్వ మహబూబ్‌ నగర్‌, వికారాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలోని 70 మండలాల్లో 1226 గ్రామాలతో పాటు హైదరాబాద్‌ తాగునీటి అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత ల పథకాన్ని ప్రారంభించి పనులు జరుపుతున్నప్పటికీ ఏపీ అభ్యంతరాలతో పనుల్లో వేగం తగ్గింది. అయితే బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు తెలంగాణ వినిపించే వాదనలతో తిరిగి పనుల్లో వేగం పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement