Thursday, February 22, 2024

స‌ల్మాన్ ఖాన్ చిత్రంలో బ‌తుక‌మ్మ సాంగ్.. ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ క‌విత‌

ఈద్ సంద‌ర్భంగా ఏప్రిల్ 4న రిలీజ్ కానుంది కిసీ కా భాయ్ కిసీ కాజాన్ చిత్రం. ఈ చిత్రంలో హీరోగా బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్నాడు.సల్మాన్‌ ఖాన్‌ తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవి ప్రసాద్‌, రవి బస్రూర్‌, హిమేశ్ రేషమ్మియా సంగీత దర్శలుగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ న‌టుడు వెంక‌టేశ్ కీలకపాత్ర పోషించనుండటంతో తెలుగులోనూ ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి బతుకమ్మ సాంగ్‌ను రిలీజ్‌ చేసింది. లేటెస్ట్‌గా విడుదలైన ఈ పాట ఆకట్టుకుంటుంది. . ఈ పాటలో బతుకమ్మ పండుగ ఉట్టిపడేట్టు కనిపిస్తుంది. భూమిక, పూజా హెగ్డే దాండియా స్టెప్స్ అదిరిపోయాయి. పాట చివర్లో సల్మాన్ పంచెలో దర్శనమివ్వడం పాటకే హైలేట్‌గా నిలిచింది.ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా తమిళంలో సూపర్‌ హిట్టయిన ‘వీరమ్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఈ సాంగ్ విడుదలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బతుకమ్మకు పాన్ ఇండియా క్రేజ్ దక్కుతుదంటూ ట్వీట్ చేశారు. ఇక తెలంగాణ వాసులు కూడా సంతోషిస్తున్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ బతుకమ్మకు గుర్తింపు దక్కుతుండటంతో సంతోషిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement