Sunday, April 28, 2024

TS: మెరుగైన ఉత్పత్తికి కృషి చేయండి.. సింగ‌రేణి సీఎండీ బలరాం

యైటింక్లయిన్ కాలనీ, జనవరి 13 (ప్రభ న్యూస్‌) : సింగరేణి సంస్థ ఆర్జీ- 2 ఏరియా పరిధిలోని ఓసిపి- 3ని ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరాం విస్తృతంగా పర్యటించారు. సీఎండీగా పదవీ బాధ్య‌తలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆర్జీ2 ఏరియాలో పర్యటించిన ఆయన ముందుగా సిహెచ్‌పిలో బొగ్గు రవాణాను క్షుణ్ణంగా పరిశీలించారు. బొగ్గు అవసరాల దృష్ట్యా వేగవంతంగా నాణ్యమైన బొగ్గును రవాణా చేయాలని సూచించారు. అనంతరం వారు ఓసిపి- 3 కృషి భవన్‌ వద్దకు వచ్చి నైట్‌ షిప్ట్‌ ఉద్యోగులతో మాట్లాడారు. వారి నుండి మెరుగైన బొగ్గు ఉత్పత్తి కి సలహాలు, సూచనలు తీసుకున్నారు. సంస్థ స్థితి గతులను, లక్ష్యాలను వివరించి వాటిని చేరుకోవడానికి ఉద్యోగులు కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం సీఎండీని అధికారులు, ఉద్యోగులు శాలువాతో సన్మానించారు.

అక్కడి నుండి వ్యూ పాయింట్‌ వద్దకు వెళ్లి పని స్థలాలను పరిశీలించారు. అధికారులను నుండి బొగ్గు ఉత్పత్తి వివరాలను తెలుసుకొని క్వారీలోకి వెళ్లి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న యంత్రాలను, పని స్థలాలను పరిశీలించి, స్వయంగా శావల్‌ యంత్రంలోకి వెళ్లి ఆపరేటర్‌ డంపర్‌లో లోడ్‌ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న ఆపరేటర్లతో మాట్లాడి వారిలో స్ఫూర్తిని నింపి, దిశానిర్ధేశం చేశారు. ఓవర్ బర్డ‌న్‌ తొలగించి తరలిస్తున్న డంప్‌ యార్డ్‌ను పరిశీలించి రక్షణతో కూడిన ఉత్పత్తి తీసే లా చూడాలని అధికారులకు సూచించారు. సీఎండీ వెంట ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఎల్‌వి సూర్యనారాయణ, జీఎం రక్షణ ఆర్జీ రీజియన్‌ ఎస్‌.సాంబయ్య, ప్రాజెక్ట్‌ అధికారి ఎస్‌.మధుసూదన్‌, ఏరియా ఇంజినీర్‌ నర్సింహారావ్‌, గని మేనేజర్‌ డి.రమేశ్‌, సర్వే అధికారి నర్సింగారావ్‌, ఆర్జీ- 1 సీనియర్‌ సెక్యూరిటి అధికారి వీరారెడ్డి, ఆర్జీ- 2 అఫిషియేటింగ్‌ సీనియర్‌ సెక్యూరిటి అధికారి వెంకటమోహన్‌, ఓసిపి3 కి సంబంధించిన ఇతర అధికారులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement