Thursday, April 25, 2024

ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ వ‌చ్చేలా చర్యలు చేపట్టాలి : భ‌వేశ్ మిశ్రా

భూపాలపల్లి కలెక్టరేట్, (ప్రభ న్యూస్ ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అర్హత ఉన్న ఎస్సీ విద్యార్థులందరికీ ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ వచ్చేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఎస్సీ అభివృద్ధి, విద్యా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్సీ అభివృద్ధి శాఖ, విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో 5 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ అందించడం పై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 2034 మంది ఎస్సీ విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ ను పొందడానికి అర్హత గల వారున్నారని ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించడం జరుగుతుందని, ఇప్పటి వరకు జిల్లాలో ఒకరు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇప్పటివరకు ఒకరు మాత్రమే ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేసి.. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఎస్సీ విద్యార్థులు స్కాలర్ షిప్ కోసం సరైన సమయంలో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ అండ్ విద్యా శాఖల మధ్య సమన్వయలోపం, విద్యార్థుల స్కాలర్ షిప్ ప్రభావం పడుతుందని, వెంటనే విద్యాశాఖ, ఎస్సీ అభివృద్ధి శాఖల అధికారులు సంయుక్తంగా పాఠశాలల వారిగా, తరగతి వారిగా ఎస్సీ విద్యార్థుల వివరాలను సేకరించి వారికి స్కాలర్ షిప్ కోసం అప్లై చేసే విధానం పై అవగాహన కల్పించి, అర్హత ఉన్న ప్రతి ఎస్సీ విద్యార్థి ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునేలా చూడాలని ఆదేశించారు.

5 నుండి 8 వరకు చదువుతున్న బాలికలకు రూ. 1500 లు, బాలురకు రూ.1000లు, 9, 10 చదువుతున్న బాలబాలికలిరువురికి రూ.3000ల‌ చొప్పున సంవత్సరానికి ప్రభుత్వం స్కాలర్ షిప్ అందజేస్తుందన్నారు. కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ లతో www.telangana epass cgg. gov.in మెయిల్ ద్వారా డిసెంబర్ 31 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే జిల్లాలో స్కాలర్షిప్ లను పొందడానికి అర్హత ఉన్న‌ ఎస్సీ విద్యార్థుల పూర్తి వివరాలను అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు కిషన్ రావు, శివరంజని, ఎస్సీ అభివృద్ధి శాఖ సూపరింటిండెంట్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement