Friday, May 3, 2024

నిజాంసాగర్ కు నిలకడగా ఇన్ ఫ్లో..

నిజామాబాద్‌ అర్బన్‌, (ప్రభన్యూస్‌): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో నీటిమట్టం నిలకడగా ఉందని ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోకి స్వల్పంగా 760 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందన్నా రు. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 50 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 558 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ తాగునీటి కోసం 142 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో పోతుందని పేర్కొన్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (90టీఎంసీ)లు కాగా గురువారం సాయంత్రానికి 1091 అడుగులు (90టీఎంసీ)ల నీటి నిల్వ ఉందని వివరించారు. జూన్‌ 1వ తేదీ నుంచి ప్రాజెక్టులోకి 675టీఎంసీల నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువల ద్వారా 603 టీఎంసీల నీరు విడుదల చేయడం జరిగిందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement