Sunday, April 28, 2024

TS: బంజ‌రాల‌కు అండ‌గా ఉంటాం… వారి అభ్యున్న‌తికి కృషి చేస్తాం – రేవంత్ రెడ్డి

బంజారా సోదరులతో సమావేశమంటే కాంగ్రెస్‌ కుటుంబసభ్యులను కలిసినంత ఆనందమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నగరంలోని బంజారా భవన్‌లో నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ జయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ 1976లో బంజారాలను ఎస్టీ జాబితాలో ఇందిరాగాంధీ చేర్చార‌న్నారు.

రాష్ట్రంలోని అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మించే బాధ్యతను మేం తీసుకుంటామ‌ని చెప్పారు. గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత మా ప్రభుత్వానిదేన‌ని హామీ ఇచ్చారు. విద్యుత్‌, తాగునీరు.. ఇలా ఏ సమస్య ఉన్నా త‌న‌ దృష్టికి తీసుకురావాలని బంజ‌రాల‌ను కోరారు.. నియోజకవర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాల్లో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు. . చదువుకుంటేనే సమాజంలో గౌరవం ఉంటుంద‌ని చెప్పారు. . ఆ బాట పట్టి.. సంత్‌ సేవాలాల్‌ మార్గంలో నడవాల‌ని కోరారు… మీ కోసం.. మీ అభ్యున్నతికి కష్టపడే ప్రభుత్వమిద‌ని అంటూ . వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి కృషి చేయాల‌ని బంజ‌రాల‌కు పిలుపు ఇచ్చారు.

- Advertisement -

లంబాడీల‌ను అన్ని విధాల ఆదుకుంటాం – మంత్రి కోమ‌టిరెడ్డి
లంబాడీల అరుదైన సంస్కృతిని కాపాడుకోవడం మన అందరి భాద్యత, వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని.. సెలవు ప్రకటించాలని బంజారా సోదరులు అడగగానే.. కార్యక్రమాన్ని ఇవ్వాల అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. లంబాడా ఉద్యోగ సోదరులకు ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించామని గుర్తు చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement