Monday, May 6, 2024

అంబులెన్స్‌ లో డీజిల్ లేక… హాస్పిటల్ కు చేరలేక… నడి రోడ్డుపైనే ప్రసవం

నిర్మల్ – .తీవ్ర నొప్పులతో అల్లాడుతున్న ఆదివాసి గర్బిణి నట్టాదేవిలో రోడ్డుపైనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా పెంబి అటవీ ప్రాంతంలోని కడెం నది సమీపంలోని మారుమూల గిరిజన గ్రామమైన తులసిపేటలో చోటుచేసుకుందితల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నప్పటికీ తీవ్ర నొప్పులతో వాగు ఒడ్డున నాలుగు గంటలు గడిపింది..

నిర్మల్ జిల్లా పెంబి మండలం ఆదివాసీ గూడెంకు చెందిన తులసిపేటకు చెందిన గంగామణి అనే ఆదివాసీ మహిళకు గురువారం రాత్రి వెన్నునొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే గతేడాది కురిసిన వర్షాలకు గ్రామ సమీపంలోని పస్పుల వంతెన కడెం వాగు ప్రవాహానికి కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఈ గ్రామంతో పాటు మరో 10 మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు నదిలో అత్యంత ప్రమాదకరంగా ప్రయాణిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే గురువారం రాత్రి 10 గంటల సమయంలో పెంబి మండలం తులసిపేట్ గ్రామానికి చెందిన గంగామణి అనే గర్భిణికి తీవ్ర నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. రోడ్డు సరిగా లేకపోవడంతో అక్కడికి చేరుకోలేకపోతున్నామని, పస్పుల వంతెన మీదుగా తీసుకువస్తే ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. గర్భిణి కుటుంబ సభ్యులు ఎడ్లబండిలో అతికష్టమ్మీద కడెంవాగు దాటారు. అయితే ఒడ్డుకు చేరినా అంబులెన్స్ రాలేదని.. కారణం అడిగితే అంబులెన్స్‌లో డీజిల్ అయిపోయిందని, లేదంటే డ్రై కార్ట్‌లో తరలించే ఏర్పాట్లు చేశామని బదులిచ్చారు.

అయితే గంగామణి మాత్రం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో రోడ్డుపైనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది వెంటనే ప్రథమ చికిత్స చేసి పెంబి ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. డీజిల్‌ లేకపోవడంతో అంబులెన్స్‌ ఆలస్యంగా రావడంతో ఓ మహిళ నది ఒడ్డున నాలుగు గంటలపాటు రోడ్డుపైనే నరకయాతన అనుభవించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement