Saturday, April 27, 2024

Sports Day … మేజర్ ధ్యాన్ చంద్ జయంతి … క్రీడా పోటీలను ప్రారంభించిన సభాపతి…

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో మేజర్ ద్యాన్ చంద్ జయంతి సందర్భంగా యువజన మరియు క్రీడా సంక్షేమ శాఖల ఉ్నతాధికారులతో ఆద్వర్యంలో బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై న సభాపతి మేజర్ ద్యానచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. క్రీడాకారులు, క్రీడాభిమానులకు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ద్యానచంద్ నా శ్రద్ధాంజలి ఘటించారు.చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం సభాపతి వివరించారు.చదువులో ఆసక్తి, ప్రతిభ పెరగాలంటే క్రీడలు ఎంతో అవసరం అన్నారు.
క్రీడల వలన శారీరకంగా, మానసికంగా శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామాలలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది అనే క్రీడా ప్రాంగణాలను గ్రామీణ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బాన్సువాడ పట్టణంలోని స్టేడియంలోని వసతులను క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సభాపతి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రీడాకారులకు అన్ని విదాలుగా ప్రోత్సాహం అందిస్తామని సభాపతి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి మున్సిపల్ చైర్మన్ గంగాధర్ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement