Tuesday, December 3, 2024

TS: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్పీకర్ ప్రసాద్ పూజలు

వికారాబాద్, మార్చి 29 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం హోమం పూజా కార్యక్రమం నిర్వహించారు. అధికారిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూతురు అనన్య, అల్లుడు చేతన్ లతో కలిసి ఆయన యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల, మాజీ మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ, మాజీ మార్కెట్ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చిగులపల్లి రమేష్, నాయకులు రఘుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, అనంతరెడ్డి, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement