Friday, May 17, 2024

వైద్యంకోసం రిమ్స్ కి వచ్చిన నాగుపాము..

ఆదిలాబాద్ జిల్లా రిమ్స్‌ ఆస్పత్రిలో నాగుపాము సంచారం కలకలం రేపింది. ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో పామును చూసిన బాలింతలు, వారి సంరక్షకులు భయాందోళనకు గురయ్యారు. వార్డులో ఒక్కసారిగా పొడుగాటి నాగుపాము కనబడటంతో అక్కడ ఉన్నవారు ఉలిక్కిపడ్డారు. వెంటనే పాము భయంతో ప్రజలు బెడ్ పైకి ఎక్కి కూర్చున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు కానీ మెటర్నటీ వార్డులోకి చొరబడిన నాగుపాము కాసేపు వార్డులో సంచరించింది. వార్డులో ఉన్న వారు బిగ్గరగా కేకలు వేయడంతో వారి శబ్ధానికి అక్కడి నుంచి టయిలెట్స్ రూమ్ లోకి వెళ్లింది. మూత్రశాలలో చెత్తాచెదారం ఉండడంతో ఎంత వెతికినా పాము దొరకలేదు. వెంటనే వార్డులో ఉన్నవారు బాత్ రూమ్ డోర్ ను మూసివేశారు. చివరకు వార్డు నుంచి రోగులను వేరే గదికి మార్చారు. అనంతరం స్నేక్ క్యాచర్ సాయంతో పామును పట్టుకుని.. అటవీ ప్రాంతంలో వదిలేశారు. అయితే పాము హాస్పిటల్‌లోకి రావడం‌తో  అధికారులు, సిబ్బంది తీరుపై రోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా రిమ్స్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే, తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. జిల్లా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement