Saturday, May 4, 2024

కొంచెం రిలీఫ్‌.. స్వ‌ల్పంగా త‌గ్గిన వంట నూనెల ధ‌ర‌

వంట నూనెల ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు కొంచెం ఊరట క‌ల‌గ‌నుంది. అంతర్జాతీయ విపణిలో నూనె ధరలు తగ్గడంతో దేశీయంగా కాసింత తగ్గుముఖం పట్టాయి. పామాయిల్ ధర లీటరుకు రూ. 7-8 తగ్గగా, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ. 10 నుంచి 15 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది.

ఇక‌.. సోయాబీన్ ఆయిల్ ధర రూ. 5 తగ్గినట్టు భారతీయ వంటనూనెల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు సుధాకర్‌రావు దేశాయ్ తెలిపారు. ఫ్రీడం సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరను గత వారం రూ. 15-20 తగ్గించినట్టు హైదరాబాద్‌కు చెందిన జెమిని ఎడిబుల్ అండ్ ఫ్యాట్స్ కంపెనీ తెలిపింది. ఈ వారం మరో 20 రూపాయలు తగ్గించనున్నట్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement