Sunday, April 28, 2024

రోడ్డు ప్రమాదాలకు బ్రేక్ వేసేలా సూచిక బోర్డులు: మంత్రి సబితారెడ్డి

ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి: తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి…చాలా మంది ఇబ్బందులపాలవుతున్నారు..రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండనీ రాష్ట విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు. అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ మధ్యలో జాతీయ రహదారి పనులు పూర్తి కావాటానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో అప్పటివరకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.ఇటీవలి తరుచుగా ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరగటం బాధాకరమని,ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల పై శుక్రవారం నాడు మంత్రి కార్యాలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తో కలిసి సమీక్షించారు.సైబరాబాద్ కమిషనరేట్ లోని లా అండ్ ఆర్డర్ ,ట్రాఫిక్,జాతీయ రహదారుల సంస్థ అధికారులు, ఆర్ అండ్ బి,ఫారెస్ట్ అధికారులతో కలిసి మంత్రి సమీక్షించారు.

తరుచుగా ప్రమాదాలు జరిగే స్థలాలు గుర్తించి ఆయా ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.స్పీడ్ లిమిట్ బోర్డులతో పాటు,స్పీడ్ ను నియంత్రించేలా స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయాలన్నారు.మొయినబాద్, చేవెళ్ల ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు తో పాటు జంక్షన్ల అభివృద్ధి చేపట్టాలన్నారు.ఆయా చోట్ల పనుల కోసం మంత్రి ప్రత్యేకంగా 15 లక్షలు మంజూరు చేసారు.ఎన్ హెచ్ 163 రోడ్డు కావటంతో రోడ్డు మధ్యలో ప్లాస్టిక్ బొల్లార్స్ తో పాటు రోడ్డు అంచులను మట్టితో అయిన ముందుగా నింపాలని అన్నారు.రోడ్డుపై పాదచారులు,పశువులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ నిడివి గల రోడ్డు వద్ద కొన్ని ప్రాంతాల్లో విస్తరణ పనులు చేపట్టాలన్నారు.కనక మామిడి నుండి ముడిమ్యాల వరకు, బస్తేపూర్,మిర్జాగూడ గెట్ ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే తో కలిసి ఆయా గ్రామాల సర్పంచ్ లతో కలిసి సోమవారం నుండే తాత్కాలిక పనులు ప్రారంభించాలన్నారు.

ఆయా ప్రాంతాల్లో వివిధ శాఖల సమన్వయం తో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. .ప్రమాదాల నివారణకు,ప్రాణనష్టం జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సబితారెడ్డి అధికారులను ఆదేశించారు. చూడాలన్నారు.ఈ సమీక్షా సమావేశంలో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి ,ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి ,ట్రాఫిక్ సేఫ్టీ నోడల్ అధికారి ఎల్ సి నాయక్ ,పిడి జాతీయ రహదారులు కృష్ణ ప్రసాద్ , ఈ ఈ ధర్మారెడ్డి ,ఆర్అండ్ బి ఎస్ఈ శ్రీనివాసరావు ,జిల్లా ఫారెస్ట్ అధికారి జానకిరామ్ ,రాజేంద్రనగర్,చేవెళ్ల ఏ సీపీ లు రవీందర్ రెడ్డి ,గంగాధర్ ,ట్రాఫిక్ ఏసీపీ విశ్వ ప్రసాద్ ,అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement