Monday, May 6, 2024

జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలను ముట్టడించిన ఎస్‌ఎఫ్‌ఐ.. ఎందుకో తెలుసా..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌): గత రెండేళ్ల నుండి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముట్టడికి ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునివ్వడంతో ఈమేరకు జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు భారీగా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. 2020-21 సంవత్సరానికి రూ.3100 కోట్ల స్కాలర్‌షిప్స్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్‌ ఉన్నదని రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్‌.మూర్తి, టి.నాగరాజు తెలిపారు.

ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కళాశాల యాజమాన్యాలు వేధింపులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. పెండింగ్‌ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చలా నష్టపోతున్నారన్నారు. కొన్ని చోట్ల పోలీసులు అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని వారు ఒక ప్రకటనలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement