Sunday, April 28, 2024

TS | మైనర్ బాలికపై లైంగిక దాడి.. ఇన్స్ స్పెక్టర్ బండారి సస్పెండ్

మైనర్ బాలిక పై లైంగిక దాడికి యత్నించి ఫోక్సో కేసులో అరెస్టయిన భూపాలపల్లి జిల్లా సైబర్ క్రైం ఇన్స్ స్పెక్టర్ బండారి సంపత్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఎ. వి. రంగనాథ్ ఉత్తర్వులు జారీచేసారు. భూపాలపల్లి జిల్లాలో సైబర్ క్రైం ఇన్స్ స్పెక్టర్ గా పనిచేస్తున్న బండారి సంపత్ కుమార్ గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కేయూసి పోలీస్ స్టేషన్ ఎస్. ఐ గా విధులు నిర్వహించే సమయంలో ఒక మహిళతో ఏర్పడింది.

సదరు మహిళ కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఓ కాలనీలో నివాసం వుంటోంది. ఇన్స్ స్పెక్టర్ సంపత్ పరిచయంతో మహిళ కాపురంలో గొడవలు రావడంతో భర్తతో దూరమైన మహిళ తో ఇన్స్ స్పెక్టర్ సంపత్ కుమార్ సహాజీవనం చేయసాగాడు. దీనితో సదరు మహిళా భర్త గతంలో వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేయగా సంపత్ కుమార్ సిపి రంగనాథ్ వీఆర్ అటాచ్ చేసారు.

కొద్ది రోజుల తర్వాత సంపత్ కుమార్ కు ఇన్స్ స్పెక్టర్ గా పదోన్నతి పై భూపాలపల్లి జిల్లా సైబర్ క్రైం ఇన్స్ స్పెక్టర్ నియమించబడ్డాడు. ఇదే క్రమంలో ఇన్స్ స్పెక్టర్ సంపత్ సదరు మహిళ వద్దకు వస్తూ పోతున్న క్రమంలో సంపత్ దృష్టి మహిళ కుమార్తె పై పడింది. ఇటీవల కాలం ఇన్స్ స్పెక్టర్ సంపత్ కుమార్ అ బాలికపై అత్యాచారానికి యత్నించాడు.

ఈ సంఘటనతో సదరు మహిళ కేయుసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం ఇన్స్ స్పెక్టర్ సంపత్ కుమార్ పోలీసులు ఫోక్సో కేసు క్రింద అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. భద్రత కల్పించాల్సిన పోలీస్ అధికారి బాలిక పై అత్యాచారానికి యత్నించినందుకు ఇన్స్ స్పెక్టర్ సంపత్ పై శాఖపరమైన తీసుకునే చర్యల్లో భాగంగా భూపాల్ పల్లి సైబర్ క్రైమ్ ఇన్స్ స్పెక్టర్ సంపత్ కుమార్ ను సస్పెండ్ చేస్తూన్నట్లుగా మల్టీ జోన్ 1 ఐజీ ఎ. వి. రంగనాథ్ వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement