Saturday, May 18, 2024

Seethakka Counter – తొంద‌రెందుకు కెటిఆర్ …. ముందుంది అస‌లు క‌థ‌..

హైద‌రాబాద్ – అప్ప‌డే తొంద‌ర‌ప‌డి విమ‌ర్శ‌లు చేయకండి అంటూ కెటిఆర్ కు మంత్రి సీత‌క్క కౌంట‌ర్ ఇచ్చారు.. అధికారంలోకి వ‌చ్చిన రెండు రోజుల‌లో కీల‌క హామీలు అమ‌లు చేస్తామ‌ని మాట ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు నింద త‌మ‌పై వేస్తుందంటూ కెటిఆర్ చేసిన కామెంట్స్ పై ఆమె మండిప‌డ్డారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధ్యం కాని హామీలు ఇచ్చారన్న వ్యాఖ్యాల‌ను తీవ్రంగా ఖండించారు..

అసెంబ్లీ లాబీలో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ, . బీఆర్ఎస్ నేతలకు అంత తొందర పాటు వద్దన్నారు. అధికారం పోయిందన్న బాధ కేటీఆర్‌ను వెంటాడుతోందన్నారు. అయితే.. తాము ఇస్తా అన్న దానికి బీఆర్ఎస్ వాళ్ళు పెంచి చెప్పారు కదా అని ప్రశ్నించారు. కాగా.. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఒక్కో హామీని క్ర‌మ ప‌ద్ద‌తిలో అమలు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని తెలిపారు. కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement