Friday, May 10, 2024

టీఎస్ మద్యం షాపుల టెండర్ల షెడ్యూల్ విడుద‌ల

తెలంగాణ ప్ర‌భుత్వం మద్యం దుకాణాల టెండర్లకు షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 10 నుంచి 18 వరకు మద్యం దుకాణాలకు టెండర్లు వేయదలచిన వారు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. నాన్‌ రిఫండబుల్‌ అమౌంట్‌గా రూ.2 లక్షలు చెల్లించాల‌ని నిర్ణయించింది. మద్యం షాపుల లాటరీని ఈ నెల 20వ తేదీన తీయనున్నట్లు పేర్కొంది. గత 2019 నిర్వహించిన లాటరీలో మద్యం షాపులు వచ్చినవారి గడువు అక్టోబర్‌తో ముగిసింది. కరోనా, లాక్‌ డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలకు ఒక నెల రోజులు గడువు పొడిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement