Friday, May 17, 2024

సినిమా హాల్ నిర్మిస్తున్న ‘బన్నీ’..’ఏషియన్ సినిమాస్’ సంస్థతో భాగస్వామ్యం..

టాలీవుడ్ న‌టీ న‌టులు త‌మ సంపాద‌న‌ని బిజినెస్ ల రూపంలో పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు,విజ‌య్ దేవ‌ర‌కొండకి సొంత సినిమాహాళ్ళు ఉన్నాయి. ఇప్పుడీ బిజినెస్ లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా దిగారు. కాగా బ‌న్నీ సినిమా థియేటర్ పేరు ‘AAA సినిమాస్’. ఇది ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మితమవుతోంది. అందుకే అల్లు అర్జున్ పేరు కలిసొచ్చేలా ‘ట్రిపుల్ ఏ’గా నామకరణం చేశారు. అమీర్ పేటలో పూజా కార్యక్రమాలు జరగ్గా, అల్లు అర్జున్, సునీల్ నారంగ్, నారాయణ్ దాస్ నారంగ్ తదితరులు హాజరయ్యారు. కాగా, బన్నీ సినిమా థియటర్ కు సంబంధించి ట్రిపుల్ ఏ లోగో కూడా డిజైన్ చేశారు. టాలీవుడ్ లో ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో సూపర్ స్టార్ మహేశ్ బాబు, యువ హీరో విజయ్ దేవరకొండ కూడా సొంత థియేటర్లను కలిగివుండడం తెలిసిందే. ఏఎంబీ సినిమాస్ పేరిట మహేశ్ బాబు గచ్చిబౌలిలో సినిమా థియేటర్ నిర్మించగా, విజయ్ దేవరకొండ ఏవీడీ సినిమాస్ పేరుతో మహబూబ్ నగర్ లో సినిమా థియేటర్ నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement