Monday, May 6, 2024

”జయమ్మ పంచాయితీ ”..సుమ ఫ‌స్ట్ లుక్ అదుర్స్..

బుల్లితెర మ‌హారాణి, స్టార్ యాంక‌ర్ సుమ గురించి తెలుగు వారికి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆమె చ‌లాకీత‌నం..మాట‌ల‌తో ఆక‌ట్టుకునే గుణం ఆమె సొంతం. ఎవ‌రినీ నొప్పింప‌క‌..తానొవ్వ‌క అనే రీతిలో ఉంటుంది. కాగా సుమ వెండితెర‌పై మెర‌వ‌నుంది. ఈ మేర‌కు ఆమె న‌టించ‌నున్న చిత్రంలోని ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. యాంకర్‌ గానే కాకుండా… సినిమాల్లోనూ భిన్న పాత్రలు చేసే సత్తా ఉన్న నటి. అయితే.. ప్రస్తుతం విజయ దర్శకత్వంలో సుమ ఓ సినిమా చేస్తోంది. వెన్నెల క్రియేషన్స్ బ్యాన్‌ర్‌ పై ప్రొడక్షన్‌ నెం. 2 గా తెరకెక్కుతున్న ఈ సినిమా కు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈసినిమా టైటిల్‌.. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ రిలీజ్‌ చేశారు. ఈ సినిమా కు ” జయమ్మ పంచాయితీ ” అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. టైటిల్‌ తో పాటు ఫస్ట్‌ లుక్‌ కూడా చాలా వెరైటీ గా ఉంది. విభిన్న అంశాలతో కూడిన పోస్టర్‌ లో గ్రామీణ వాతావరణాన్ని ఆవిష్కరించారు. పోస్టర్‌ ను బట్టి చూస్తే… సినిమాలో సుమ ఓ పల్లెటూరి పెద్ద పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సినిమా పై మంచి ఇంప్రెషన్‌ తెచ్చుకుంది. ఇక ” జయమ్మ పంచాయితీ ” సుమ‌కి ఏ మేర‌కు విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement