Thursday, May 2, 2024

చిట్యాల వాగుపై హై లెవెల్ బ్రిడ్జి వెంటనే నిర్మించాలి …సర్పంచ్ ఎర్రబెల్లి

చిట్యాల గ్రామంలో ఉన్న వాగు గడిచిన 75 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఉదృతంగా ప్రవహిస్తుంది. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో వాగుదాటి వేరే ఊరికి వెళ్లాలంటే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజలు వెళ్లాల్సి వస్తుంది. వాగుకి అవతలి వైపున చిట్యాల గ్రామానికి చెందిన డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక ఉండడంతో అక్కడికి వెళ్లాలంటే దాదాపు 15 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లాల్సి వస్తుందనీ గ్రామ సర్పంచ్ ఎర్రబెల్లి రామ్మోహన్ రావు అన్నారు.

చిట్యాల వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం 6 కోట్ల రూపాయల నిధులు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు బ్రిడ్జి నిర్మించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, జిల్లా మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చొరవ తీసుకుని వెంటనే హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement