Tuesday, April 30, 2024

HYD: కే కే మీనన్ నటించిన “లవ్ ఆల్” మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను గెలుచుకున్న వింక్ స్టూడియో

హైదరాబాద్ : డౌన్‌లోడ్స్, రోజువారీ క్రియాశీల యూజర్స్ ద్వారా భారతదేశం నం.1 మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ అయిన వింక్ మ్యూజిక్, ఈరోజు భారతదేశం అతిపెద్ద మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ ఎకోసిస్టమ్ అయిన వింక్ స్టూడియో పి.గోపీచంద్ అనే బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన కే కే మీనన్ నటించిన “లవ్ ఆల్” అనే చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను గెలుచుకున్నట్లు ప్రకటించినది.“లవ్ ఆల్” చిత్రాన్ని మహేశ్ భట్ పి గోపీచంద్ లు ఆనంద్ పండిట్ తో కలిసి నిర్మించారు. ఇది ఎమ్. రమేశ్ లక్ష్మీ గణపతి ఫిల్మ్ స్టూడియోస్ ద్వారా సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేయబడుతుంది. ఈ చిత్రానికి సుధాంశు శర్మ దర్శకత్వం వహించగా, స్వస్తిక ముఖర్జీ, రాబిన్ దాస్, శ్రీశ్వర, అతుల్ శ్రీవాస్తవ, రాజా బుందెల నటించారు. ఈ సినిమాలో ఇప్పటికే వింక్ పై అందుబాటులో ఉన్న ఐదు చిరకాలం గుర్తుండిపోయే పాటలు ఉన్నాయి.

  1. బాతోన్ బాతోన్ మే, గాయకులు – జుబిన్ నౌతియాల్
  2. గిల్లి సీ సుబాహ్, గాయకులు – పాపన్
  3. ఛల్ ఉఠ్ ఝట్ పఠ్, గాయకులు – సోనూ నిగమ్
  4. లవ్ ఆల్ బోల్ దే, గాయకులు – కే కే మీనన్
  5. సహాస్ దో సహాస్, గాయకులు – అంజలి గైక్వాడ్

ఏర్‌టెల్ డిజిటల్ అండ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, సీఈఓ ఆదర్శ్ నాయర్ మాట్లాడుతూ… వింక్ స్టూడియో స్వతంత్ర కళాకారుల కోసం ఒక సృజనాత్మక వేదికను అందించే లక్ష్యంతో స్థాపించబడిందన్నారు. అలాగే ఇది వారు ఎదుర్కొనే మోనిటైజేషన్, ఆవిష్కరణల పరమైన సమస్యల విషయంలో కూడా వారికి సహాయపడుతుందన్నారు. తాము స్వతంత్ర కళాకారులతో గొప్ప విజయాలను పొందామన్నారు. ప్రస్తుతం వేయిమందికి పైగా కళాకారులు తమతో ఉన్నారన్నారు. ఈ డిస్ట్రిబ్యూషన్ భాగస్వామ్యం అనేది డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ కోసం అన్వేషిస్తున్న, ఏర్‌టెల్ స్వాభావికమైన రీచ్, కనెక్టివిటీని ఉపయోగించాలనుకుంటున్న నిర్మాతల కోసం కొత్త ద్వైపాక్షిక మార్గాలను తెరుస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement