Monday, April 29, 2024

తెలంగాణ భ‌వ‌న్ లో ఘ‌నంగా సంత్‌ సేవాలాల్‌ జయంతి వేడుక‌లు…

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో గిరిజ‌న ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా కొన‌సాగుతున్నాయి.. నేటి కార్య‌క్ర‌మంలో మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, స‌త్య‌వ‌తి రాథోడ్, మ‌ల్లారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.. ఈ సంద‌ర్భం గా మంత్రి త‌ల‌సాని మాట్లాడుతూ, గిరిజన రిజర్వేషన్లు పెంచాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశారని, అయితే కేంద్రప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అనుమతి రాలేదని అన్నారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచేలా సంత్‌ సేవాలాల్‌ జయంతి ఉత్సవాలు జరపాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని చెప్పారు. సంత్‌ సేవాలాల్‌ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.. గతపాలకుల హయాంలో గిరిజనులు నిర్లక్ష్యం చేయబడ్డారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక గిరిజనుల అభివృద్ధికి కృషిచేస్తున్నామని అన్నారు. త్వరలో పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుందని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దని తెలిపారు. రాష్ట్రంలో గిరిజనుల చదువులకు గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సేవాలాల్‌ జయంతిని పండుగలా జరుపుకుంటున్నామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గిరిజన బిడ్డలు సంతోషంగా ఉండటానికి సీఎం కేసీఆర్‌ కారణమన్నారు. అన్ని రంగాల్లో గిరిజనులకు ప్రాధాన్యం ఇచ్చారని వెల్లడించారు. గిరిజన బిడ్డ సత్యవతి రాథోడ్‌కు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని తెలిపారు. సేవాలాల్‌ జయంతి, నాగోబా గిరిజన జాతరకు రూ.కోటి చొప్పున ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement