Tuesday, April 23, 2024

చెన్నై : మూడో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 53/3

ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇంగ్లాండ్ కు 482 పరుగుల విజయ లక్ష్యాన్ని నిరర్దేశించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు పడగొట్టింది. స్పిన్నర్ అక్షర్ పటేల్ రెండు వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా ఈ టెస్టులో విజయం సాధించాలంట ఇంకా 428 పరుగులు సాధించాలి. నాలుగో ఇన్నింగ్స్ లో ఈ స్థాయిలో స్కోరు సాధిండం ఏ జట్టుకైనా అసాధ్యం. అందులోనూ స్పిన్ గింగిరాలు తిరుగుతున్న చెన్నై పిచ్ పై ఇంత భారీ స్కోరు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. డ్రాగా ముగించుకోవాలన్నా పూర్తిగా రెండు రోజుల పాటు వికెట్లను కాచుకోవాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ టెస్ట్ లో ఇంగ్లాండ్ ఓటమి నుంచి తప్పించుకోవడం సాధ్యంం కాదనే చెప్పాలి. అంతకు ముందు అశ్విన్ సెంచరీ, కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులు చేసిన సంగతి విదితమే. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 134 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement