Monday, May 6, 2024

School Holidays: తెలంగాణ‌లో 12 నుంచి విద్యా సంస్థ‌ల‌కు సంక్రాంతి హాలీడేస్ ..

హైద‌రాబాద్ – జనవరి వచ్చిందంటే చాలు విద్యార్ధుల‌ హాలిడేస్ కోసం ఎదురుచూస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే ఇలా విద్యార్ధుల‌కు మస్త్ సెలవులు వస్తాయి. ఆ సారి తెలంగాణలో సంక్రాంతికి విద్యా సంస్థ‌ల‌కు ఆరు రోజులు సెలవులు రానున్నాయి.

జనవరి 12 నుంచి 17 వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. మిషనరీ విద్యా సంస్థ‌ల‌కు మినహా అన్ని విద్యాసంస్తలకు ఈ సెలవులు వర్తిస్తాయని పాఠశాల విద్యాడైరెక్టర్ వెల్లడించారు. జనవరి12న ఆప్షనల్ హాలిడే 13 తేదిన రెండోశనివారం హాలిడే. అలాగే 14న భోగి పండుగ,15న సోమవారం సంక్రాంతి సాధారణ హాలిడే ఉంటుంది. అలాగే జనవరి 16న కనుమ హాలిడే ఇచ్చారు. అలాగే జనవరి 25, 26న కూడా హాలిడే గా ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement