Friday, May 17, 2024

Samirpet – ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి

శామీర్ పేట, అక్టోబర్ 14 (ప్రభ న్యూస్): శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్గటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం ఉదయం ఓఆర్ఆర్ పై ఓ లారిని వెనుక నుంచి ఇన్నోవా వాహనం ఢీ కొట్టింది ఇన్నోవా కీసర వైపు నుంచి వస్తూ లారిని ఢీ కొట్టినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇన్నోవా డ్రైవర్ మారుతీ, ప్రయాణికుడు రాజు లుగ పోలీసులు గుర్తించారు. గాయపడ్డ మరో ఇద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియల్సి ఉంది కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఫోటో రైటప్.రోడ్డు ప్రమాదం దృశ్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement