Sunday, April 28, 2024

New Collector – మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్

ప్రభ న్యూస్ ప్రతినిధి మేడ్చల్ అక్టోబర్ 13 : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గా గౌతమ్ పోట్రు నియమితులయ్యారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో ఆయన జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ గా విచ్చేసిన గౌతమ్ పోట్రు సెర్ప్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎన్నికల అధికారిగా విధులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ కు జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, జిల్లా స్థాయి అధికారులు పుష్పగుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement