Friday, May 3, 2024

Warangal – టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు – భారీగా నగదు పట్టివేత

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా IPS గారి ఆదేశాల మేరకు రఘునాధపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ టు హైదరాబాద్ ప్రధాన రహదారి టోల్గేట్ వద్ద వాహనాల ఆకస్మిక తనిఖీలు చేపట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీస్ సిబ్బందికి వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న TS03FD7369 కారులో సిటు కింద, డాష్బోర్డ్ లో 4,35,000/-(నాలుగు లక్షల ముప్పై అయిదు వేల రూపాయలు) దొరకడం జరిగింది.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కారులో ప్రయాణిస్తున్న నసిరుద్దీన్ ఎటువంటి ఆధారాలు చూపనందున అట్టి రూపాయలను పోలీసులు సిజ్ చేయడం జరిగింది.ఈ ఆకస్మిక తనిఖీలో టాస్క్ ‌ఫోర్స్ ACP మధుసూదన్,టాస్క్‌ఫోర్స్ Ci రాంబాబు,టాస్క్‌ఫోర్స్ Si లు నరసింహారావు,శరత్, రఘునాధపల్లి CI శ్రీనివాస్ రెడ్డి,SI రఘుపతి, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అశోక్, నరేష్,రాజు,శ్రీను, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement