Sunday, April 28, 2024

Pretol Bunks: రెండో రోజూ సేమ్ సీన్ – బంకుల వ‌ద్ద భారీగా వాహ‌నాలు…..

హైదరాబాద్‌: రెండో రోజు కూడా ప్రెటోల్‌ బంక్‌ల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. నిన్న ఒకసారిగా వాహనదారులు బంకుల వద్దకు చేరుకోవడంతో బంకులో పెట్రోల్ నిల్వలు అయిపోయాయి. గ‌త‌ రాత్రి పెట్రోల్‌, డీజిల్ ట్యాంకర్లు చేరుకోవడంతో యథావిధిగా బంకుల వద్ద పెట్రోల్ సరఫరా కొనసాగుతుంది.

దీంతో హైదరాబాద్‌ పలు పెట్రోల్‌ బంక్‌ల వద్ద వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్‌, డీజిల్‌ దొరుకుతుందో లేదోనని ముందు జాగ్రత్త చర్యగా బుధవారం తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకుల వద్దకు వాహనదారులు చేరుకుంటున్నారు. బంక్‌లు ఇంకా ఓపెన్ కాకముందే వాహనాలను వరుసగా కిలోమీటర్ల మేర లైన్లలో ఉంచారు.

ఆయిల్‌ ట్యాంకర్ల డ్రైవర్లతో సమ్మెతో రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఏర్పడింది. సోమవారం( జనవరి 1) నుంచి ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో బంకులకు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్‌ నగరంలో చాలా వరకు పెట్రోల్‌ బంకులు మూసివేశారు. బంకుల ముందు నో స్టాక్‌ బోర్డులు పెట్టారు. అయితే తెరచి ఉన్న కొన్ని పెట్రోల్‌ బంకుల ముందు హైదరాబాద్‌లో వాహనదారులు పెట్రోల్‌ కోసం క్యూ కట్టారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్‌ బంకులు మూసివేయడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో తెరచి ఉన్న కొన్ని పెట్రోల్‌ బంకుల ముందు వాహనదారులు క్యాన్‌లతో బారులు తీరడం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌లకు దారి తీసింది. కొన్ని చోట్ల పెట్రోల్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement