Friday, May 3, 2024

ISRO | మట్టిలో మాణిక్యం.. సోవ్లూతండా ముద్దుబిడ్డ ఇస్త్రో శాస్త్రవేత్త!

మహబూబాబాద్‌ రూరల్‌, ప్రభన్యూస్‌ : చదువుతో పాటు వివిధ రంగాలల్లో రాణించాలంటే పట్టుదల ఉన్నప్పుడే ప్రతి మనిషికి ఏదైన సాధ్యమే అనడానికి మహబూబాబాద్‌ మండలం పర్వతగిరి గ్రామశివారు సోవ్లూతండా గ్రామపంచాయతీకి చెందిన భూక్య రమేష్‌ ఇటీవల చంద్రయాన్‌-3 ప్రయోగం సందర్భంగా ఇస్త్రోలో ప్రధాన శాస్త్రవేత్తలతో కలిసి అందులో పాల్గొనడం ఆనందంగా ఉందని మహబూబాబాద్‌ ప్రాంత ప్రజలతో పాటు తండావాసులు, రాజకీయ, మేధావి వర్గాలకు చెందిన వ్యక్తులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా భూక్యరమేష్‌ ఒక మారుమూల ప్రాంతమైన గిరిజన తండాలో జన్మించి తనకున్న పట్టుదలతోఅంచలంచెలుగా ఈస్థాయికి రావడం మట్టిలో మాణిక్యమంటే అందుకు ఉదహరణ రమేష్‌ అని చెప్పవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చంద్రయాన్‌ 2,3 ప్రయోగం సమంయలో అక్కడ ఉండటం ఎంతో గర్వకారణమని శాస్త్రవేత్త భూక్య రమేష్‌ కుటుంబ సభ్యులు, బందుమిత్రులు, స్నేహితులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement