Thursday, May 16, 2024

Big Story | కేసీఆర్‌పై విజయశాంతి పోటీ.. బీజేపీ నుంచి కామారెడ్డి బరిలో!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: గెలుపోటముల అంశాన్ని పక్కనపెట్టి బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేయాలని భాజపా నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కామారెడ్డి అసెంబ్లిd నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు తాను సిద్ధమని సంకేతాలిస్తూ ట్వీట్‌ చేశారు. ఆ అవకాశం తనకే కల్పించాలని పార్టీ అధిష్టానానికి విజయశాంతి విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తాను స్థాపించిన ‘తల్లి తెలంగాణ’ పార్టీని అప్పట్లో టీఆర్‌ఎస్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే.

అనంతరం పార్టీలో విజయశాంతికి క్రమక్రమంగా ప్రాధాన్యత తగ్గుతుండడంతో రాజీనామా చేయక తప్పలేదు. పార్టీ అధినేత కేసీఆర్‌తో ఆ నాటి నుంచీ రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. రాజకీయంగా ఇప్పటికీ కేసీర్‌ను ప్రత్యర్థిగానే భావిస్తున్న విజయశాంతి ఈసారి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎంచుకున్న స్థానం కామారెడ్డి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు.

అగ్రనేతలు పోటీ చేసే స్థానాలపై ఆయా పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక విషయంపై తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుగున్న నేపథ్యంలో క్రమక్రమంగా పాలిటిక్స్‌ హీ-టె-క్కుతున్నాయి. సీఎం కేసీఆర్‌పై, బీజేపీ రాష్ట్ర నాయకురాలు విజయశాంతి పోటీ-కి సిద్ధమవుతున్నట్లు- విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని పరోక్షంగా దృవీకరిస్తూ, ఈ మేరకు విజయశాంతి టీ-్వట్‌ కూడా చేశారు. పార్టీ ఆదేశిస్తే కామారెడ్డి నుండి పోటీ-కి సిద్ధమని ఆమె అంటున్నారు.

గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తున్న విజయశాంతికి ఆ స్థానం నుంచే బరిలో దింపుతారన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. అందుకు తాజా టీ-్వట్లు బలం చేకూరుస్తున్నాయి. కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో తన పోటీ- విషయం తమ పార్టీ నిర్ణయింస్తుందని తెలిపారు.

- Advertisement -

రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు తన సమాధానం ఇదేనని ట్విటర్‌ వేదికగా విజయశాంతి స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే తమ విధానమని చెప్పారు. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్‌ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం అన్నారు. ఇది ప్రజలకు తెలియచేయడం తెలంగాణ ఉద్యమకారుల అందరి బాధ్యత అన్నారు.

అయితే కామారెడ్డి, గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌ నుంచి పోటీ- చేయనున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి నుంచి కేసీఆర్‌పై పోటీ- చేసేందుకు విజయశాంతి పోటీ-కిసై అంటు-న్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అలర్ట్‌ అయ్యాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. కామారెడ్డి, గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌ పోటీ- చేయనున్నారు. సిట్టింగుల్లో ఏడుగురికి అవకాశం ఇవ్వలేదు. నాంపల్లి, గోషామహల్‌, జనగాం, నర్సాపూర్‌ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు కాంగ్రెస్‌, బీజేపీ ఇప్పటికే నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement