Wednesday, May 22, 2024

RTC Employees -రెండు గంటలు విధులు బహిష్కరణ… నిలిచిన సిటీ బస్ సర్వీసులు

హైదరాబాద్ – తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) ఇచ్చిన పిలుపుతో ఆర్టీసీ కార్మికులు నిరసనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 నుంచి 8 గంటల వరకు కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు.

రెండు గంటల కార్మికుల నిరసన తర్వాత.. పలు ప్రాంతాల్లో యథాతథంగా బస్సులు ప్రయాణిస్తున్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఇంకా సేవలు ప్రారంభం కాలేదు.హైదరాబాద్‌లో ఉప్పల్‌, చెంగిచర్ల, హయత్‌నగర్‌, షాద్‌నగర్‌, ఫలక్‌నుమా, ఫరూక్ నగర్, హకీంపేట, లింగపల్లి హెచ్‌సీయూ, కూకట్‌పల్లి తదితర డిపోల్లో కార్మికులు నిరసన చేపట్టారు. తెలంగాణ గవర్నర్ తమ సమస్యల పట్ల వెంటనే స్పందించి ఆర్టీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్ప లేదు. ఉదయాన్నే విద్యాసంస్థలకు, కార్యాలయాలకు వెళ్లే వారు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.

రాజ్‌భవన్‌ వద్ద నిరసన….

మరోవైపు, ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌ వద్ద నిరసన చేపట్టాలని టీఎంయూ నిర్ణయించింది. ఈ క్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కార్మికులు ఉదయం 10 గంటలకు నెక్లెస్‌ రోడ్డుకు రావాలని పిలుపునిచ్చింది. దీంతో నగరవాసులకు ఈ మధ్యాహ్నం వరకు ప్రయాణ కష్టాలు కొనసాగనున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement