Saturday, April 27, 2024

TS : బీఆర్ఎస్ గూటికి ఆర్ఎస్ ప్రవీణ్… ఎమోషనల్ పోస్ట్…

ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరనున్నారు . ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.

- Advertisement -

తెలంగాణ ప్రజలకు నమస్కారం… నేను నా రాజకీయ భవితవ్యం పై ఈ రోజు హైదరాబాదులో వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమధనం జరిపాను. అట్టి సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం నేను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నానని పేర్కొన్నారు. నేను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్దాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా… దయచేసి నిండు మనసుతో ఆశీర్వదించండని కోరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

Advertisement

తాజా వార్తలు

Advertisement