Saturday, May 4, 2024

విప్లవ సాహిత్యం ప్రింట్ చేస్తున్నారని.. ప్రెస్‌పై పోలీసుల దాడులు..

హైదరాబాద్‌, (ప్రభ‌న్కూస్): నిషేధిత మావోయిస్టు సాహిత్యం ప్రింట్‌ చేస్తున్నారన్న సమాచారంతో అంబర్‌పేట మూసా రాంబాగ్‌లోని ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పోలీసుల సోదాలు నిర్వహించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన మావోయిస్టు అగ్రనేత ఆర్కే జీవిత చరిత్రను ప్రింట్‌ చేస్తున్నట్టుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ప్రింటింగ్‌ ప్రెస్‌పై దాడి చేసిన పోలీసులు వెయ్యి పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సోదాలలో అడిషనల్‌ డీసీపీ మురళీధర్‌రావు, మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ, స్థానిక పోలీసులు కూడా ఉన్నారు. నవ్య ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఆర్కే జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ముద్రిస్తున్నారని తెలిసింది. పోలీసులు జరిపిన దాడులలో బైండింగ్‌ చేసిన వెయ్యి పుస్తకాలతో పాటు బైండింగ్‌ చేయని పుస్తక మెటీరియల్‌ని కూడా సీజ్‌ చేసినట్లు ఏసీపీ వెంకటరమణ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement