Sunday, April 28, 2024

సిఎస్ సోమేష్ కుమార్ పై సిబిఐ విచార‌ణ‌కు రేవంత్ డిమాండ్…

హైద‌రాబాద్ – తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ను ఎపి క్యాడ‌ర్ కు పంపి వేయాల‌ని హైకోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ సోమేష్ తీసుకున్న‌ప‌లు నిర్ణ‌యాల‌పై సిబిఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు.. ఈ మేర‌కు ఆయ‌న ట్వ‌ట్ట‌ర్ లో ట్విట్ చేశారు.. సిఎస్ నియామకం అక్రమం అని తామే మొదటి నుండి చెబుతున్నామని, తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తామ చెప్పిందే నిజ‌మైంద‌ని అన్నారు.

బిహార్ ముఠాకు సోమేశ్ లీడర్ అని అంటూ అనర్హుడైన ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని అన్నారు. అలాగే. ఇప్పటి వరకు సోమేశ్ కుమార్ సీఎస్ హోదాలో తీసుకున్న నిర్ణయాలు సమీక్షించి వాటిపై సీబీఐ విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమేశ్ కుమార్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రద్దు చేయాలని కోరారు. కోర్టు తీర్పుతో నైనాతెలంగాణ ప్రాంత ఐఏఎస్ లకు ఎప్పటికైనా ప్రాధాన్యం ఇవ్వాలని ప్ర‌భుత్వానికి రేవంత్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement